గ్రేటర్‌లో సీన్ రిపీట్.. కాంగ్రెస్‌కు మళ్లీ జీరో
హైదరాబాద్‌లో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించగా.. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ విజయం సాధించారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. గ్రేటర్ పరిధిలోకి వచ్చే నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీకి నిరాశే ఎదురైంది. ఏ ఒక్క స్థానంలోనూ ఓటర్లు ఆదరించలేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. హైదరాబాద్ మినహా మిగతా మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హైదరాబాద్‌లో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించగా.. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర రెడ్డి, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ విజయం సాధించారు.
ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్‌కు ఓటర్లు విజయాన్ని కట్టబెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్.. కాంగ్రెస్‌లో చేరి విజయాన్ని సొంతం చేసుకున్నారు. కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.