అసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులు
ఇవాళ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
BY Raju Asari17 March 2025 12:28 PM IST

X
Raju Asari Updated On: 17 March 2025 12:41 PM IST
తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. వీటితో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. పొట్టి శ్రీరాములు వర్సిటీని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీ మారుస్తూ బిల్లులను ప్రవేశపెట్టింది.
Next Story