సత్యమేవ జయతే.. హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలన ప్రతిష్టను మసకబార్చేందుకు ఇటీవల శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లు ఫోర్బ్స్ రిపోర్టు ద్వారా రుజువైందన్నారు హరీష్ రావు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని అధికార కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఫోర్బ్స్ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టుపై మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు.
Forbes India report stated that Telangana Debt to GSDP ratio is among the Lowest 5 States of India and stood at 23.8.
— Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024
Congress Govt white paper is proved to be a deliberate attempt to "tarnish" the image of 10 years of KCR regime as per recent Forbes report.
BJP, Social media,…
ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం.. తెలంగాణ అప్పులు GSDPలో 23.8 శాతం మాత్రమేని చెప్పింది. GSDPలో అతి తక్కువ శాతం అప్పులు ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటన్నారు హరీష్ రావు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రిపోర్టు స్పష్టం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలన ప్రతిష్టను మసకబార్చేందుకు ఇటీవల శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లు ఫోర్బ్స్ రిపోర్టు ద్వారా రుజువైందన్నారు హరీష్ రావు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ, దాని సోషల్‌మీడియా, యూట్యూబర్‌లు చేస్తున్న ప్రచారం ఫేక్ అని తేలిపోయిందన్నారు. సత్యమే గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు.