Telugu Global
Telangana

రాష్ట్ర పండుగగా సదర్..ప్రభుత్వం జీవో జారీ

యాదవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యదవులు ఘనంగా జరుపుకునే సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

రాష్ట్ర పండుగగా సదర్..ప్రభుత్వం జీవో జారీ
X

యాదవులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సదర్ పండుగకు రాష్ట్ర పండుగ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనాన్ని ప్రతి ఏడాది నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ సమ్మేళన్ ఒకటి. దీపావళి మరుసటి రోజున జరుపుకుంటారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. నేడు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనంలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు నగరానికి చేరకున్నాయి.

హర్యానాకు చెందిన ఏడడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుతో ఉండే ‘గోలు 2’ అనే దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లోని దున్నరాజులు కూడా సదర్‌లో తమ విన్యాసాలను చూపనున్నాయి. సదర్ సమ్మేళనం దృష్ట్యా నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని నగర పోలీసులు సూచించారు. పట్టణంలో ముషీరాబాద్‌లో నిర్వహించే ‘పెద్ద సదర్’ ఫేమస్. యాదవులు తమ వద్ద గల దున్నపోతుల్లో బలమైన, అందమైన దున్నపోతులను ఈ పండుగలో ప్రదర్శిస్తారు

First Published:  2 Nov 2024 9:37 AM GMT
Next Story