Telugu Global
Telangana

స్పెషల్ బస్సుల పేరిట ఆర్టీసీ బాదుడు

దసరా సందర్భంగా నగరంలోని ప్రజలు తమ తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పెషల్ బస్సుల పేరిట ఆర్టీసీ బాదుడు
X

దసరా పండుగ వేళ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు పండుగ వేళ టిఎస్ఆర్టిసి అదనపు చార్జీలతో మోత మోగిస్తుందని తమ జేబులకు చిల్లు పెడుతోందని వాపోతున్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకగా ఇక బస్సు చార్జీ లు కూడా విపరీతంగా పెంచడంతో ప్రయాణికులలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు రాష్ట్రవ్యాప్తంగా 6, 304 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సొంత ఊళ్ళకి వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్టు టీజీ ఆర్టీసీ పేర్కొంది.

ఈసారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రద్దీ కారణంగా గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 స్పెషల్ సర్వీస్ లను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వీడీ సజ్జనార్ పేర్కొన్నారు. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. దసరా రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా 6,300 బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ ప్రకటించారు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులను అదనంగా నడిపిస్తున్నామన్నారు. దసరా సందర్భంగా నగరంలోని ప్రజలు తమ తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సర్కార్ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకోనేవారు హాస్టళ్లలో ఉండి చదువుకునే కాలేజీ విద్యార్థులంతా ఊరు బాట పట్టారు. పెద్దలు సైతం తమ తమ సొంతూళ్లకు పయనమవుతుండటంతో ఆర్టీసీ బస్టాండ్‌లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

First Published:  9 Oct 2024 1:23 PM GMT
Next Story