తెలంగాణ రికార్డు.. ఇప్పటివరకూ రూ.709 కోట్ల సొత్తు సీజ్
పట్టుబడిన సొత్తులో రూ.282 కోట్ల నగదు, రూ.186 కోట్ల విలువైన బంగారం, ఇతర అభరణాలు, రూ.117 కోట్ల విలువైన మద్యం, రూ.39 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారీగా సొత్తు పట్టుబడింది. ఇప్పటివరకూ పట్టుబడిన సొత్తు విలువ రూ.700 కోట్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇదే అత్యధికం.
పట్టుబడిన సొత్తులో రూ.282 కోట్ల నగదు, రూ.186 కోట్ల విలువైన బంగారం, ఇతర అభరణాలు, రూ.117 కోట్ల విలువైన మద్యం, రూ.39 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఓటర్లకు ఉచితంగా పంచేందుకు తీసుకెళ్తున్న రూ.83 కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఉన్నాయి.
మొత్తంగా ఇప్పటివరకూ తెలంగాణలో రూ.709 కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పట్టుబడిన సొత్తుతో పోల్చితే ఇదే అత్యధికం. ఇక రెండో స్థానంలో రాజస్థాన్‌లో రూ.690 కోట్ల విలువైన సొత్తును ఎన్నికల సిబ్బంది సీజ్ చేశారు. ఇప్పటికే ఆ నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుండగా.. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.