Telugu Global
Telangana

రూ.49 కోట్లతో అసెంబ్లీ మరమ్మత్తులు : మంత్రి కోమటిరెడ్డి

అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

రూ.49 కోట్లతో  అసెంబ్లీ మరమ్మత్తులు : మంత్రి కోమటిరెడ్డి
X

తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ. 49 కోట్ల అంచనాతో అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 3 నెలల్లో శాసన సభలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని ఆయన తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే వాహనంలో సీఎం, మంత్రులు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

ఒకే దగ్గర ఉంటే సమయం ఆదా అవుతుందని తెలిపారు. భవనానికి కావల్సిన ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ మరియు ప్లంబింగ్ పనులపై టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఆగాఖాన్ ట్రస్ట్ కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న రూ. 2 కోట్ల రూపాయల నిధులను సమావేశం నుంచే డిప్యూటీ సీఎంతో మాట్లాడి.. అప్పటికప్పుడే విడుదల చేయించారు. అంతేకాదు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక గదులను నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

First Published:  22 Oct 2024 2:25 PM GMT
Next Story