Telugu Global
Telangana

మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు : సీఎం రేవంత్

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వ స్ధలంలో ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలతో కమీటి వేసేందుకు ప్రభుత్వం సిద్దంగా సీఎం అన్నారు.

మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు : సీఎం రేవంత్
X

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వ స్ధలంలో ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే అంబర్‌పేటలోని పోలీసు అకాడమీని మలక్ పేట్‌లోని రేస్ కోర్స్ మైదానాన్ని పట్టణం బయటికి తరిలించి స్ధలంలో పేదలకు డబుల్‌బెడ్ రూమ్‌లు నిర్మిస్తామని సీఎం తెలిపారు. మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. దీనిపై ప్రతిపక్షాలతో కమీటి వేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సర్కార్‌ ఏర్పటు చేసే కమీటిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఉంటారని రేవంత్ అన్నారు. మూసీ నిర్వాసితులు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు.

వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉందన్నారు. ..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం పేర్కొన్నారు. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ప్రధాని మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి అని రేవంత్ ప్రశ్నించారు.

First Published:  5 Oct 2024 10:21 AM GMT
Next Story