హైదరాబాద్ లో 'రోచె' ఫార్మా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు..
క్యాన్సర్ నిర్థారణ, కంటి వైద్యం, రోగనిరోధక వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు మందులను తయారు చేయడంలో రోచె ఫేమస్. ఈ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనకు హైదరాబాద్ ను ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు మంత్రి కేటీఆర్.
1896లో ఏర్పాటైన సంస్థ.
62 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం..
ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది ఉద్యోగులు..
ఇలాంటి సంస్థ హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని స్థాపించడం గర్వించదగ్గ విషయం.
ప్రముఖ ఫార్మా సంస్థ 'రోచె' తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను విస్తరించింది. హైదరాబాద్‌లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. డాటా సైన్స్, అడ్వాన్స్ డ్ అనలిటిక్స్ సామర్థ్యాల అభివృద్ధికి హైదరాబాద్ లో రోచె పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడి ఇది. ఈ సందర్భంగా రోచె ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సింప్సన్ ఇమ్మాన్యుయేల్, మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు.
కేటీఆర్ కృషి ఫలితం..
స్విట్జర్లాండ్ కి చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ రోచె హైదరాబాద్ కార్యకలాపాలకు అంత తేలిగ్గా మొగ్గు చూపలేదు. రోచె సంస్థ చైర్మన్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్ తో మంత్రి కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. 2020లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం సందర్భంగా భేటీ అయ్యారు. 2021లో సంస్థ ప్రతినిధులతో మరోసారి భేటీ జరిగింది. హైదరాబాద్ లో ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగాలకున్న అనుకూల పరిస్థితులను కేటీఆర్ వారికి వివరించారు. ఆ కృషి ఫలితంగానే రోచె కంపెనీ హైదరాబాద్ లో తమ సేవలను విస్తరిస్తోంది. క్యాన్సర్ నిర్థారణ, కంటి వైద్యం, రోగనిరోధక వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు మందులను తయారు చేయడంలో రోచె ఫేమస్. ఈ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనకు హైదరాబాద్ ను ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు మంత్రి కేటీఆర్.
వినూత్న డేటా ఆధారిత పరిష్కారాలకోసం హైదరాబాద్‌లో 'గేట్' ఏర్పాటు చేసినట్టు తెలిపారు రోచె ప్రతినిధులు. తాజా విస్తరణలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి 100 మంది ఉద్యోగులను నియమించుకుంటామన్నారు. 'గేట్' ను మరింతగా విస్తరిస్తామని చెప్పారు.