Telugu Global
Telangana

ఇండ్లు కూల్చేసిన ప్రాంతాల్లో రేవంత్‌ పాదయాత్ర చెయ్యాలే

కేంద్ర మంత్రి బండి సంజయ్‌

ఇండ్లు కూల్చేసిన ప్రాంతాల్లో రేవంత్‌ పాదయాత్ర చెయ్యాలే
X

రేవంత్‌ రెడ్డి నల్గొండ జిల్లా సంగెంలో కాదు.. నీకు ధైర్యం ఉంటే మూసీ బాధితుల ఇండ్లు కూల్చేసిన ప్రాంతంలో పాదయాత్ర చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని కూడా ఆయన పాదయాత్ర చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా రేవంత్‌, తాను కొట్లాడమని.. అందుకే తాను, రేవంత్‌ ఒక్కటేనని కేటీఆర్‌ మాట్లాడుతున్నారని అన్నారు. డైవర్షన్‌, కాంప్రమైజ్‌ పాలిటిక్స్‌ చేసే అలవాటు కేటీఆర్‌ కే ఉందన్నారు. బీజేపీకి స్పేస్‌ లేకుండా చేయాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ కు క్యాడర్‌ లేదు.. కెపాసిటీ లేదు అన్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేదిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ రెస్ట్‌ లో ఉంటే కేటీఆర్‌ యాక్టింగ్‌ చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్‌ఎస్‌ కు అభ్యర్థులే దొరకడం లేదన్నారు. సర్పంచులకు బీఆర్‌ఎస్‌ బిల్లులు పెండింగ్‌ లో పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేస్తుందన్నారు. రేవంత్‌, కేటీఆర్‌ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే అరెస్ట్‌ చేయడం లేదన్నారు. జైలుకు పంపించిన వాళ్లతో కాంప్రమైజ్‌ అవుతున్నావా రేవంత్‌.. నీ బిడ్డ పెళ్లికి వెళ్లకుండా ఇబ్బంది పెట్టిన విషయం గుర్తు చేసుకో అన్నారు.

First Published:  8 Nov 2024 2:19 PM IST
Next Story