Telugu Global
Telangana

రేవంత్‌ నువ్వు కట్టుకుంటావా చీర.. రాహుల్‌కు కట్టిస్తావా.. కేటీఆర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

వంద రోజుల్లో అన్నీ చేస్తానని చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలేనన్నారు కేటీఆర్. రేవంత్‌ డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యమని.. చేసేదేమే సోనియమ్మ జపమన్నారు.

రేవంత్‌ నువ్వు కట్టుకుంటావా చీర.. రాహుల్‌కు కట్టిస్తావా.. కేటీఆర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌
X

ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయో.. లేదో తెలుసుకోవాలంటే చీర కట్టుకుని బస్సు ఎక్కాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని నిరూపిస్తే నువ్వు కట్టుకుంటావా.. లేదా రాహుల్‌ గాంధీకి చీర కట్టిస్తావా అంటూ కౌంటర్ ఇచ్చారు. నిర్మల్ సభలో రాహుల్‌ గాంధీ చెప్పినట్లు తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చినట్లు చూపిస్తావా అని రేవంత్‌కు సవాల్‌ విసిరారు. ఇన్ని పచ్చి అబద్ధాలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్.


వంద రోజుల్లో అన్నీ చేస్తానని చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలేనన్నారు కేటీఆర్. రేవంత్‌ డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యమని.. చేసేదేమే సోనియమ్మ జపమన్నారు. కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్‌ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్లు బంద్ అయ్యాయన్నారు కేటీఆర్. కల్యాణలక్ష్మి నిలిచిపోయిందన్నారు. తులం బంగారం అడ్రస్‌ కూడా లేదన్నారు కేటీఆర్. ఫ్రీ బస్సు బిల్డప్‌కు మాత్రమేనని.. అందులో సీట్లే దొరకవన్నారు. బస్సుల్లో ముష్టి యుద్ధాలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. అన్ని హామీలను అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని.. చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప నువ్వు, నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదని అందరికీ తెలిసిపోయిందని రేవంత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్.

ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే..!

అంతకుముందు నిర్మల్ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయో.. లేదో తెలుసుకోవాలంటే కేటీఆర్ చీర కట్టుకుని అమ్మాయిలాగా తయారయి ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ అడగాలన్నారు. కండక్టర్ టికెట్ డబ్బులు అడిగితే ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని ఒప్పుకుంటామన్నారు. డబ్బులు అడగకపోతే ఇచ్చిన హామీలు అమలయినట్లేనన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  5 May 2024 11:53 AM GMT
Next Story