Telugu Global
Telangana

రాబందులా మారిన రేవంత్‌

రేవంత్‌రెడ్డీ.. అధికారంలోకి వచ్చాక నిన్నేం చేయాలో మాకు తెలుసుని వార్నింగ్‌ ఇచ్చిన కేటీఆర్‌

రాబందులా మారిన రేవంత్‌
X

కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. లగచర్ల ఘటనలో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో ఉన్న 16 మంది బాధితులను ఆయన పరామర్శించారు. సుమారు 40 నిమిషాల పాటు జైల్లో వారితో ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రేవంత్‌రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారు. ఇప్పుడు వేల ఎకరాలు కావాలంటున్నారు. కులగణనలో పాల్గొన వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. వేరే చోట ఐటీఐ చదువుకున్న విద్యార్థిని కూడా అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారని కేటీఆర్‌ చెప్పారు. సీఎం అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఫోన్‌లో ఆదేశాలిస్తున్నారు. అధికారులు పాటిస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. దాడులు చేస్తూ వీడియోల్లో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలను వదిలేశారని, కేవలం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలనే అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్‌ సర్కార్‌ యత్నిన్నది. సీఎం రేవంత్‌ కావాలనే ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారని దుయ్యబట్టారు. తన పదవి ఐదేళ్లే అని రేవంత్‌ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్‌ హెచ్చరించారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలన్నదే రేవంత్‌ యత్నమని ఆరోపించారు. ఇవాళ కొడంగల్‌ తిరబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అన్నారు. రేవంత్‌రెడ్డీ.. అధికారంలోకి వచ్చాక నిన్నేం చేయాలో మాకు తెలుసున్నారు. కేసులెన్ని పెట్టినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భయపడొద్దు అన్నారు. ఎకరం రూ. 60 లక్షల భూమిని రూ. 10 లక్షలకు గుంజుకోవడానియి ప్రయత్నిస్తున్నారు. పేదవాడి కన్నీళ్లు ఉసురు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రేవంత్‌రెడ్డికి చేతనైతే మాతో కొట్లాడాలి.. అమాయకులతో కాదన్నారు.

ఫార్మాసిటీ కోసం కేసీఆర్‌ 14 వేల ఎకరాలు సేకరించారు. దాన్ని రద్దు చేసి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తానని, మా అన్నదమ్ములకు భూములను అప్పగిస్తానని, ఫార్మా విలేజ్‌ల పేరుతో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో, కొడంగల్‌లో, తెలంగాణలో 20 ఫార్మా విలేజ్‌లు పెడతానని అంటున్నారు. రేవంత్‌రెడ్డి వికృతమైన, అనాలోచిత ఆలోచనలు చేస్తున్నారో ఆ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే న్యాల్‌కల్‌ రైతులైనా, కొడంగల్‌ రైతులైనా ధైర్యం ఉండండి. మీకు బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ అండగా ఉంటారని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మీకు ప్రజాస్వామికంగా, న్యాయం రావల్సిన దాని కోసం తాము అండగా నిలబడుతామన్నారు. రేవంత్‌ సర్కార్‌ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా వాటిని ఎదుర్కొంటామన్నారు. గిరిజన బిడ్డలు తమను దారుణంగా కొట్టారని చెప్పారు. 30-40 కిలోలు లేని , పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు కలెక్టర్‌ను కొట్టారని వారిపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. కాబట్టి రేవంత్‌ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఈ కేసులన్నీ రద్దు చేసి, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

First Published:  15 Nov 2024 1:46 PM IST
Next Story