రైతులను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్
బోనస్ బోగస్ అయ్యిందని ఎక్స్ వేదికగా ఆక్షేపించిన మాజీ మంత్రి హరీశ్
కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పంటల కొనుగోళ్లు, బోనస్ పై ఎక్స్ వేదికగా స్పందించారు. లాభసాటి వ్యవసాయమని, అన్ని పంటలకు బోనస్ అని హమీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీన మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితికి రేవంత్‌రెడ్డి సర్కార్ రైతును దిగజార్చిందని విమర్శించారు. బోనస్ బోగస్ అయ్యిందని ఆక్షేపించారు. కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
అక్రమ కేసులకు, బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదు
అక్రమ కేసులకు, బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదన్నారు హరీశ్. శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులను ఆయన ఖండించారు. పేదల ఇళ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కేసులా? అని ప్రశ్నించారు. కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలు చర్యలు హేయమైనవి అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కడమేనా ప్రజాపాలన? అని నిలదీశారు. అక్రమ కేసులకు, బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటమన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.