Telugu Global
Telangana

ఇది ఫైనల్ మ్యాచ్.. గుజరాత్‌ పెత్తనం VS తెలంగాణ పౌరుషం

10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న మోడీ.. విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ITIR, IIM ఇవ్వలేదన్నారు.

ఇది ఫైనల్ మ్యాచ్.. గుజరాత్‌ పెత్తనం VS తెలంగాణ పౌరుషం
X

తెలంగాణ పౌరుషం ఎవరికీ తలవంచదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్యాగాలు, పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. గుజరాత్‌ పెత్తనమో, తెలంగాణ పౌరుషమో తేల్చుకునేందుకు సిద్ధమంటూ బీజేపీకి సవాల్ విసిరారు. సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంట, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు రేవంత్.

పార్టీ కార్యకర్తలపై బాధ్యత పెరిగిందన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షాను ఢీ కొట్టబోతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి పోటీ ఉండబోతుందన్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న మోడీ.. విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ITIR, IIM ఇవ్వలేదన్నారు. తెలంగాణకు మోడీ చేయాల్సినంత అన్యాయం చేశారని ఆరోపించారు రేవంత్.


తెలంగాణకు ఎలాంటి నిధులివ్వని మోడీ ఉద్దెర చుట్టం అంటూ సెటైర్లు వేశారు రేవంత్. పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి వెళ్తే తెలంగాణకు 43 పైసలు మాత్రమే తిరిగి వస్తుందన్నారు రేవంత్. పార్లమెంట్‌లో తెలంగాణను అవమానపరిచేలా మోడీ మాట్లాడితే బీజేపీ ఎంపీలు మౌనంగా కుర్చున్నారని గుర్తు చేశారు రేవంత్. కేసీఆర్ స్క్రిప్టునే ప్రధాని మోడీ చదువుతున్నారని విమర్శించారు.

First Published:  1 May 2024 9:25 AM IST
Next Story