తనకు భద్రత పెంచాలంటూ రేవంత్ రెడ్డి పిటిషన్.. హైకోర్టు లో విచారణ
రేవంత్ రెడ్డికి సరిపడ భద్రతను ప్రభుత్వం ఇస్తున్నదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భద్రత మరింత పెంచాలని రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల ఎస్ పీలకు లేఖలు కూడా రాశారని న్యాయవాది చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్ జోడో' పేరుతో పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్ర సందర్భంగా తనకుమరింత భద్రత పెంచాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.
భూపాలపల్లిలో తనపై జరిగిన దాడిని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి భద్రతనుమరింత పెంచడం కోసం ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే రేవంత్ రెడ్డికి సరిపడ భద్రతను ప్రభుత్వం ఇస్తున్నదని ప్రభుత్వ తరపు న్యావాది కోర్టుకు తెలిపారు. భద్రత మరింత పెంచాలని రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల ఎస్ పీలకు లేఖలు కూడా రాశారని న్యాయవాది చెప్పారు.
దీనిపై స్పందించిన కోర్టు రేవంత్ రెడ్డికి నిజంగానే తగిన భద్రత కల్పించినట్లైతే ఈ రోజు ఈ విచారణ ఎందుకు జరుపుతున్నట్టు అని ప్రభుత్వ లాయర్ ను ప్రశ్నించింది. రేవంత్ కు కల్పిస్తున్న భద్రతా వివరాలను సోమవారంకల్లా తమకు చెప్పాలని రేవంత్ రెడ్డి తరపులాయర్ కు హైకోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 6 కు వాయిదా పడింది