Telugu Global
Telangana

రేవంత్‌ రెడ్డి.. తెలంగాణాను ఏం చేద్దాం అనుకుంటున్నవ్‌

సామాన్యులపైకి బుల్డోజర్‌ పంపితే రిజిస్ట్రేషన్‌ల ఆదాయం పడిపోయింది : కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి.. తెలంగాణాను ఏం చేద్దాం అనుకుంటున్నవ్‌
X

రేవంత్‌ రెడ్డి.. తెలంగాణాను ఏం చేద్దాం అనుకుంటున్నవ్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. హైడ్రా కారణంగా రెండు నెలలుగా రాష్ట్ర ఆదాయం పడిపోయిన విషయాన్ని 'ఎక్స్‌' వేదికగా ఎత్తిచూపారు. పత్రికల్లో వచ్చిన కథనాన్ని జత చేశారు. ''ప‌ని మంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌. గ‌ట్ల‌నే ఉంది చీప్ మినిస్ట‌ర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణ‌కు గుండెకాయ వంటి హైద‌రాబాద్ ను కాపాడుకోవ‌టం చేత‌కాక‌, సామాన్యుల‌పైకి బుల్డోజ‌ర్స్ పంపి.. భ‌యాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయింది. హైడ్రా హైరానాతో 2 నెల‌ల్లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింది. రిజిస్ట్రేష‌న్లు ప‌డిపోయాయి. ఆదాయం త‌గ్గిపోయింది. అయ్యా.. నువ్వు కొత్త‌గా ఆదాయం సృష్టించుడు లేకుంటే పాయే. కానీ, ఉన్న‌ది ఊడ‌గొడుతున్న‌వ్. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నావో అర్థ‌మైతుందా? నీ ఫోర్ బ్ర‌ద‌ర్ సిటీపై ఫోక‌స్ చేసి, అక్క‌డ కృత్రిమ రియ‌ల్ బూమ్ కోసం ఆలోచిస్తున్న‌ట్లున్న‌వ్.. సామాన్యుల కొనుగోలు, అమ్మ‌కం లేనిది బూమ్ ఎట్లా వ‌స్త‌ది? ఆదాయం ఎట్లా పెరుగుత‌ది.. ఏం చేద్దాం అనుకుంటున్న‌వ్ స్వామి తెలంగాణ‌ను...!'' అని ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  7 Oct 2024 5:41 PM IST
Next Story