Telugu Global
Telangana

ఆల్ ది బెస్ట్ అంటూ రేవంత్ రెడ్డి మరింత రెచ్చగొట్టారా..?

రేవంత్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ ఈ ట్వీట్ పై మండిపడుతోంది. హంతకుడే సంతాపం తెలిపినట్టు ఈ ట్వీట్ ఏంటని బీఆర్ఎస్ నుంచి కౌంటర్ పడింది.

ఆల్ ది బెస్ట్ అంటూ రేవంత్ రెడ్డి మరింత రెచ్చగొట్టారా..?
X

తెలంగాణలో డీఎస్సీ వాయిదా కోసం అభ్యర్థులు ఏ స్థాయిలో పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. చివరకు వారి పోరాటం విఫలమైంది, ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తేల్చేసింది. ఈరోజు నుంచి డీఎస్సీ పరీక్షలు కూడా మొదలయ్యాయి. నేటినుంచి ఆగస్ట్ 5 వరక ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వేశారు. 2012 తర్వాత తెలంగాణలో డీఎస్సీ జరగలేదని ఆయన గుర్తు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు జరుగుతున్న పరీక్షల ద్వారా అభ్యర్థుల కలలు ఫలించాలని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న వారి ఆకాంక్షలు నెరవేరాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు.


రేవంత్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ ట్వీట్ పై మండిపడుతోంది. హంతకుడే సంతాపం తెలిపినట్టు ఈ ట్వీట్ ఏంటని బీఆర్ఎస్ నుంచి కౌంటర్ పడింది. డీఎస్సీకి సమయం సరిపోవడం లేదని, వాయిదా వేయాలని అభ్యర్థులు బతిమిలాడినా సీఎం రేవంత్ రెడ్డి కనికరించలేదని, అలాంటి వ్యక్తి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ట్వీట్ సారాంశం. అణచివేతకు, రాక్షసానందానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెబుతారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది.


తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు ఆగస్ట్ 5 వరకు జరుగుతాయి. ఎంతోమంది నిరుద్యోగులు ఈ పరీక్షలకోసం కష్టపడి చదివారు, కొందరు టైమ్ సరిపోవడంలేదని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలో మిగతా వారు కూడా వాయిదాకు ఛాన్స్ ఉందనే నమ్మకంతో కాస్త నెమ్మదించారు. కానీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించడానికే మొగ్గుచూపింది. పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ దశలో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది, లేనిపోని విమర్శలకు దారితీసింది.

First Published:  18 July 2024 7:47 AM GMT
Next Story