అధికారంలోకి వస్తే నలుగురు మహిళా మంత్రులు - రేవంత్ రెడ్డి
మహిళల కోసం కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం తీసుకువచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి నెలా రూ.2500, రూ.500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలను మంత్రులు చేస్తామన్నారు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరకు మద్దతుగా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కేవలం ఆరుగురు మహిళలకు మాత్రమే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చిందని.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ ఇద్దరు మహిళలను మాత్రమే మంత్రులుగా చేసిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురిని మంత్రులుగా చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్.
మహిళల కోసం కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం తీసుకువచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి నెలా రూ.2500, రూ.500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇందిర గెలిస్తే.. ఢిల్లీలో సోనియా గెలిచినట్లేనన్నారు రేవంత్. సింగపురం ఇందిరను 25వేల మెజార్టీతో గెలిపించాలని స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలను కోరారు.