బీజేపీకి దెబ్బమీద దెబ్బ.. వివేక్ తో రేవంత్ భేటీ
కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కాంగ్రెస్ లో టికెట్లు సాధించుకున్నారు. వివేక్ సోదరుడు వినోద్ కి ఆల్రడీ కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. ఇప్పుడు వివేక్ కి కూడా టికెట్ ఇవ్వడం పెద్ద పనేం కాదు.
బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ లో వివేక్ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు రేవంత్ రెడ్డి. గన్ మెన్ కూడా లేకుండా ఒంటరిగా వచ్చిన రేవంత్.. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్ ఆహ్వానించినట్లు తెలిసింది. దీనిపై వివేక్ రియాక్షన్ ఇంకా బయటకు రాలేదు.
బీజేపీకి దెబ్బమీద దెబ్బ..
ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అదే సమయంలో వివేక్ పేరు వినిపించినా కూడా ఆయన మాత్రం ఆ పుకార్లను ఖండించారు. తానింకా బీజేపీలోనే ఉన్నానని, ఉంటానని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే.. రెండ్రోజుల్లోనే టీపీసీసీ అధ్యక్షుడితో ఏకాంతంగా చర్చలు జరిపారు. వివేక్ కూడా కచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ లాంఛనం కూడా పూర్తయితే బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడినట్టే లెక్క. విజయశాంతి వంటి అసంతృప్తులు కూడా బీజేపీపై లోలోపల రగిలిపోతున్నారు. ఎన్నికలనాటికి బీజేపీకి కీలక నేతలు దూరమయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కాంగ్రెస్ లో టికెట్లు సాధించుకున్నారు. వివేక్ సోదరుడు వినోద్ కి ఆల్రడీ కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. ఇప్పుడు వివేక్ కి కూడా టికెట్ ఇవ్వడం పెద్ద పనేం కాదు. ఆ హామీతోనే రేవంత్ రెడ్డి వివేక్ తో మంతనాలు సాగించినట్టు చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ కీలక నేతలంతా ఇలా బీజేపీకి హ్యాండివ్వడం ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. మరి వివేక్ స్పందన ఏంటో వేచి చూడాలి.