మక్కెలిరుగుతాయి జాగ్రత్త..
ఏ రాత్రి కష్టం వచ్చినా ఒక్క సీటీ కొట్టండి మీకు అండగా ఉండేందుకు వచ్చేస్తా అని ప్రజలకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. పదేళ్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారని, ఈ సారి కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
"ఇక్కడ రౌడీ మూకలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారట, జాగ్రత్త.. వచ్చేది మా ప్రభుత్వం, ఒక్కొక్కరి మక్కెలిరుగుతాయి. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది కాంగ్రెస్." అని రేవంత్ రెడ్డి రోడ్ షోలో వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ బోరబండలో రోడ్ షో నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఆనాడు పీజేఆర్, బోరబండ వాసులకు అండగా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వారికి తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. రౌడీయిజాన్ని హైదరాబాద్ లో లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు రేవంత్.
LIVE : " కాంగ్రెస్ విజయభేరి యాత్ర " జూబ్లీ హిల్స్ రోడ్ షో || రేవంత్ రెడ్డి
— Revanth Reddy (@revanth_anumula) November 21, 2023
https://t.co/LIDR7UoAok
సీటీ కొడితే వచ్చేస్తా..
ఏ రాత్రి కష్టం వచ్చినా ఒక్క సీటీ కొట్టండి మీకు అండగా ఉండేందుకు వచ్చేస్తా అని ప్రజలకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. పదేళ్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారని, ఈ సారి కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్న అజారుద్దీన్ ని ప్రత్యర్థులు వెటకారం చేస్తున్నారని, ఆ కామెంట్లు చేసేవారు పక్క గల్లీకి వెళితే కుక్కలు కూడా గుర్తుపట్టవని ఎద్దేవా చేశారు. అజారుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తారా..? అని అడిగారు. దేశంలో మోదీని ఎంత మంది గుర్తుపడతారో.. అజారుద్దీన్ ను కూడా అంతే మంది గుర్తుపడతారన్నారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో రోడ్ షోలలో పాల్గొంటున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రౌడీలకు హెచ్చరిక అంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అధికారంలోకి రాకముందే ఇలా వార్నింగ్ లు ఇస్తున్నారు, వస్తే ఇక ఏమైనా ఉందా అంటూ వైరి వర్గాలు విమర్శిస్తున్నాయి. శాంతిభద్రతలు పటిష్టం చేస్తామని చెప్పాల్సిన నేతలు, ఇలా వార్నింగ్ లివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
♦