Telugu Global
Telangana

రేవంత్‌రెడ్డి అదానీ, అల్లుడు కోసమే పనిచేస్తున్నారు : కేటీఆర్‌

ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు

రేవంత్‌రెడ్డి అదానీ, అల్లుడు కోసమే పనిచేస్తున్నారు : కేటీఆర్‌
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీ, అల్లుడు కోసమే పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. . లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని ఇవాళ మహబూబాబాద్‌ పట్టణంలో జరిగిన బీఆర్‌ఎస్‌ మహాధర్నాలో కేటీఆర్‌ మాట్లాడారు. లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం 3 వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే గిరిజన రైతులు తిరగపడ్డారని మాజీ మంత్రి అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడానికి ముఖ్యమంత్రికి సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడని లగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు..

రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారని ఇక ఖాతమే అని కేటీఆర్ హెచ్చారించారు. జైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. ఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందాని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారని ఆయన తెలిపారు. నేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారని మానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతామని కేటీఆర్‌ అన్నారు.

First Published:  25 Nov 2024 1:56 PM IST
Next Story