రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు.. - కొడంగల్ సభలో కేసీఆర్
రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని నమ్మి ఓటేస్తే మోసం పోవడం ఖాయమని కొడంగల్ ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రమోషన్ ఇస్తానన్నారు.
కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారు అంటూ ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జా పెడతాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి భూమాత అని పెడుతామంటున్నారని.. అది భూమాత కాదు భూమేత అంటూ సెటైర్లు వేశారు. ధరణి తీసేస్తే రైతుబంధు పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ధరణి వల్ల నిమిషాల మీద రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని, మ్యూటేషన్లు కూడా వెంటనే అయిపోతున్నాయని చెప్పారు.
రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే గబ్బు అని.. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నాడని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని చెప్పారు కేసీఆర్. తెలంగాణ కోసం కొట్లాడిన నాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర నేతల సంకల్లో ఉన్నాడంటూ విమర్శించారు. ఉద్యమకారులపైకి తుపాకీ రాముని లెక్క తుపాకీ పట్టుకుని వచ్చాడన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వెళ్లి రూ.50 లక్షలు ఇచ్చుకుంట అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు కేసీఆర్. చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డికి సిగ్గు రాలేదంటూ ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో అంగి పోయేదాకా జంపుతున్నరు.. ఇక్కడ కొడంగల్‌లో మీరు లాగు పోయేదాకా జంపాలి - సీఎం కేసీఆర్ pic.twitter.com/KMVwcRhvTg
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2023
రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని నమ్మి ఓటేస్తే మోసం పోవడం ఖాయమని కొడంగల్ ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రమోషన్ ఇస్తానన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే లాభపడేది పైరవీకారులు మాత్రమేనన్నారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో రేవంత్ తుక్కుతుక్కు ఓడిపోవడం ఖాయమన్నారు కేసీఆర్. ఏడాదిన్నరలో కొడంగల్‌కు పాలమూరు-రంగారెడ్డి నీళ్లు తెచ్చిస్తానన్నారు.