Telugu Global
Telangana

రేవంత్ దూకుడు.. 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

సిట్‌, క్రైమ్స్‌ జాయింట్ సీపీగా ఏ.వి.రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక నితిక పంత్‌, గజరావ్‌ భూపాల్‌, చందనదీప్తిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది.

రేవంత్ దూకుడు.. 9 మంది ఐపీఎస్‌ల బదిలీ
X

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా 9 మంది ఐపీఎస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా విశ్వప్రసాద్‌ను నియమించింది. సిట్‌, క్రైమ్స్‌ జాయింట్ సీపీగా ఏ.వి.రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక నితిక పంత్‌, గజరావ్‌ భూపాల్‌, చందనదీప్తిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ సీపీ - విశ్వప్రసాద్‌

సిట్‌, క్రైమ్స్‌ జాయింట్ సీపీ - ఏవీ రంగనాథ్‌

పశ్చిమ మండల డీసీపీ - విజయ్‌ కుమార్‌

స్పెషల్ బ్రాంచ్‌ డీసీపీ - జోయల్ డేవిస్‌

ఉత్తర మండల డీసీపీ - రోహిణి ప్రియదర్శిని

CCS డీసీపీ - ఎన్‌. శ్వేత

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ - 1 డీసీపీ ఎస్‌. సుబ్బారాయుడు

First Published:  17 Dec 2023 9:13 PM IST
Next Story