ఉచిత బస్సు ప్రయాణం.. జీవో రిలీజ్.. కండీషన్స్ ఇవే.!
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వద్ద రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. మహిళా మంత్రులు బస్సులో ప్రయాణం చేయనున్నారు.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వద్ద రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. మహిళా మంత్రులు బస్సులో ప్రయాణం చేయనున్నారు.
వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ట్రాన్స్‌జెండర్స్‌ను సైతం ఈ స్కీమ్‌కు అర్హులుగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి గ్యారెంటీ కింద ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. ఇందుకు ఏటా రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి భారం పడుతుందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది.