Telugu Global
Telangana

తెలంగాణ భవన్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

కాంగ్రెస్ ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు నిర‌స‌న‌గా తెలంగాణ భ‌వ‌న్ మెయిన్ గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ‌ను బీఆర్ఎస్ శ్రేణులు ద‌హ‌నం చేశారు.

తెలంగాణ భవన్ వద్ద  రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తు తెలంగాణ భ‌వ‌న్ మెయిన్ గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ‌ను బీఆర్ఎస్ శ్రేణులు ద‌హ‌నం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అనుమ‌తితో త‌దుప‌రి చ‌ర్యల‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఉప‌క్ర‌మించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై అభియోగం మోపారు. కేటీఆర్‌పై 4 సెక్షన్లు.. 13(1)A, 13(2)పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.ఫార్ములా – ఈ కార్ రేసులో కేసు న‌మోదుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీ వేదిక‌గా స్పందించారు.

ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై శాసన సభలో చ‌ర్చ‌కు పెడితే.. స‌మాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్న సంద‌ర్భంగా మిమ్మ‌ల్ని, ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాను. నిజంగా ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి, ధైర్యం ఉంటే, ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌జేయాల‌నే చిత్త‌శుద్ధి ఉంటే, ఈ రేసులో ఏదో కుంభ‌కోణం జ‌రిగింద‌ని అంటున్నారు క‌దా..? దాని మీద చ‌ర్చ పెట్టండి. మొత్తం స‌మాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని మీ ద్వారా ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తున్నాను అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

First Published:  19 Dec 2024 8:27 PM IST
Next Story