మొన్న ఉత్తమ్, ఇప్పుడు రేవంత్.. రైతుబంధుపై కాంట్రవర్సీ కామెంట్స్
కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజాభేరీ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి..కేసీఆర్ రైతుబంధు బిచ్చంలా వేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రైతుబంధుపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరువక ముందే పీసీసీ రేవంత్ రెడ్డి సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజాభేరీ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి..కేసీఆర్ రైతుబంధు బిచ్చంలా వేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రైతుబంధును బిచ్చంతో పోల్చడం వివాదాస్పదమైంది. దీంతో బీఆర్ఎస్ నేతలు రేవంత్‌పై మండిపడుతున్నారు. ఇది రేవంత్ అహంకారానికి నిదర్శనమంటూ ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ రైతులకు రైతుబంధు 10 వేల బిచ్చం లాగా వేస్తున్నాడు.. మేము 15 వేలు ఇస్తాం - రేవంత్ రెడ్డి pic.twitter.com/bJf8S2thzI
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2023
ఇటీవల మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సీఎం కేసీఆర్ రైతుబంధు పేరుతో దుబారా చేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికే మూడు గంటల కరెంటు చాలంటూ అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సీఎం కేసీఆర్ సైతం ఈ రెండు అంశాలను ప్రచార సభల్లో ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల డి.కె.శివకుమార్ సైతం కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు మిస్‌ఫైర్ అయ్యాయి. తెలంగాణలో నిర్విరామంగా కరెంటు ఇస్తుంటే కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునేందుకు సిగ్గుండాలంటూ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. రైతుల అంశమే ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.