Telugu Global
Telangana

ఫాంహౌస్ ఘటన వెనుక రేవంత్‌రెడ్డి కుట్ర : హరీష్ రావు

జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌజ్ ఘటన వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన అన్నారు.

ఫాంహౌస్ ఘటన వెనుక రేవంత్‌రెడ్డి కుట్ర : హరీష్ రావు
X

జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఫామ్‌హౌజ్ ఘటన వెనుక రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘అది ఫామ్‌హౌజ్ కాదు.. రాజ్ పాకాల నూతన ఇల్లు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్ధులు ఉంటారా?’ అని హరీష్ రావు ప్రశ్నించారు. పొలిటికల్‌గా ఎదుర్కోలేకనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై బురద జల్లుతున్నారని విమర్శించారు. మూసీ విషయంలో పేదల పక్షాన పోరాటం చేస్తున్న కారణంగానే కేటీఆర్‌ను టార్గెట్ చేశారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని విమర్శించారు.మాజీ సీఎం కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం లేదని మహిళలకు బతుకమ్మ చీరలు సైతం ఇవ్వలేకపోయారని హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రైతుబంధు ఇచ్చామన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌.. గతంలో ఉన్న రూ.10వేలు కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి హారీష్‌రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ లోనే ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. రూ.500 బోనస్ అన్నావు.. కనీసం రూ.7500 మద్దతు ధర కూడా రైతులకు రావడం లేదని హారీష్‌రావు అన్నారు.

First Published:  28 Oct 2024 4:01 PM IST
Next Story