టీడీపీ కూతురిని.. కాంగ్రెస్ కోడలిని- రేవంత్ రెడ్డి
కూతురు ఇంటి దగ్గర ఉన్నంత కాలం తల్లిదండ్రుల పక్షానే ఉంటుందని.. అత్తగారింటికి పోయిన తర్వాత కోడలిగా ఆ ఇంటి గౌరవాన్ని కాపాడటమే ఆమె బాధ్యత అని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు శిష్యుడు అంటూ బీఆర్ఎస్ నేతలు చేసే విమర్శలపై స్పందించారు పీసీసీ రేవంత్ రెడ్డి. ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూకి హాజరైన రేవంత్ రెడ్డి.. ఆ విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి సహచరుడిగా నిబద్ధతతో పని చేశానని.. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు తనను గుర్తించి, గౌరవించి అవకాశాలిచ్చారని చెప్పారు.
ఇక తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం మరో పార్టీలో చేరానని చెప్పారు. కూతురు ఇంటి దగ్గర ఉన్నంత కాలం తల్లిదండ్రుల పక్షానే ఉంటుందని.. అత్తగారింటికి పోయిన తర్వాత కోడలిగా ఆ ఇంటి గౌరవాన్ని కాపాడటమే ఆమె బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను కోడలి పాత్రను పోషిస్తున్నానని చెప్పారు రేవంత్. తనకు చంద్రబాబు నాయుడు ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదన్నారు.
నేను టీడీపీ కూతురిని
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2023
కాంగ్రెస్ పార్టీకి కోడలిని
నాకు టీడీపీ అమ్మగారి ఇల్లు
కాంగ్రెస్ అత్తగారి ఇల్లు
చంద్రబాబు నాయుడు మీద నాకు మీద నాకు ప్రేమ లేదని ఎప్పుడైనా చెప్పానా? అలా చెప్తే ఎవరైనా నమ్ముతారా - రేవంత్ రెడ్డి pic.twitter.com/dONXHbxuEh
ఇక రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు శిష్యుడే అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ హైదరాబాద్ చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందని.. చంద్రబాబు చెప్పినట్లుగా రేవంత్ నడుచుకుంటారంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.