10 రాష్ట్రాల్లో అధికారం ఒక్కచోటే బీసీ సీఎం.. ఇదీ బీజేపీ రాజకీయం
బీసీ కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. బీసీ కుల గణననే చేయలేని బీజేపీ.. బీసీని సీఎం ఎలా చేస్తుందన్నారు.
10 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్న బీజేపీ, కేవలం ఒకేచోట ఓబీసీని సీఎం చేసిందని, అలాంటి పార్టీ తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని హామీ ఇవ్వడం, బీసీలపై ప్రేమ ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని, ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రాని పార్టీ.. బీసీ వ్యక్తిని ఎలా సీఎం చేస్తుందని ప్రశ్నించారు.హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పై మండిపడ్డారు.
బీసీ కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. బీసీ కుల గణననే చేయలేని బీజేపీ.. బీసీని సీఎం ఎలా చేస్తుందన్నారు. ఎస్సీ వర్గకరణపై బీజేపీ చెప్పే మాటలు దళితులెవరూ నమ్మరని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీని పక్కన పడేస్తుందని విమర్శించారు రేవంత్ రెడ్డి.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెబుతున్నా.. రైతులకు కేవలం 8 నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల పెద్దఎత్తున భూ దోపిడీ జరిగిందని, అందుకే తాము దాన్ని మార్చేస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.
♦