పార్ట్-టైమ్ మున్సిపల్ మంత్రి.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సిటీలో డెంగ్యూ, మలేరియా, అతిసారం లాంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. మేయర్, మున్సిపల్ అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుధ్యం గాడి తప్పిందంటూ ట్వీట్ చేశారు మాజీ మున్సిపల్ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిటీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయన్నారు. సిటీలో దాదాపు 1000 స్వచ్ఛ ఆటోలు పని చేయడం లేదంటూ ట్వీట్ చేశారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయన్నారు.
హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.
— KTR (@KTRBRS) July 25, 2024
సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదు.
బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి.
డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారు.
చెత్త… pic.twitter.com/hcXOiiWmBb
చెత్త తరలింపు కేవలం కాగితాలపై పరిమితమైందన్నారు కేటీఆర్. సిటీలో డెంగ్యూ, మలేరియా, అతిసారం లాంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. మేయర్, మున్సిపల్ అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉండడంతో రేవంత్ రెడ్డిపైనా సెటైర్లు వేశారు కేటీఆర్. పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన పార్ట్ టైమ్ మున్సిపల్ మంత్రి ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలన్నారు కేటీఆర్. సిటీని పరిశుభ్రంగా ఉంచి.. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలన్నారు.