Telugu Global
Telangana

సీఎం రేవంత్‌ రెడ్డినే అరెస్ట్‌ చెయ్యాలే

ఆయన వల్లే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య : ఎంపీ డీకే అరుణ

సీఎం రేవంత్‌ రెడ్డినే అరెస్ట్‌ చెయ్యాలే
X

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యకు సీఎం రేవంత్‌ రెడ్డినే కారణమని.. ఆయనను అరెస్ట్‌ చెయ్యాలని మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణ డిమాండ్‌ చేశారు. లగచర్లలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డకున్నారు. పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గానికి ఎంపీనని.. తన నియోజకవర్గంలో పర్యటించొద్దు అని ఎలా అంటారని ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేశానని అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యకు కారణమైన రేవంత్‌ రెడ్డినే అరెస్ట్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. తాను కలెక్టర్‌ ను కలవడానికి వెళ్తున్నానని, నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. కలెక్టర్‌ ను కలిసేందుకు తనకు అపాయింట్‌మెంట్‌ ఉందన్నారు. తాము లా అండర్‌ ఆర్డర్‌ ను బ్రేక్‌ చేసే పనులేమి చేయడం లేదన్నారు. సొంత నియోజకవర్గంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యకు రేవంత్‌ కారణమయ్యాడని, ఆయన ఫెయిల్యూర్‌ సీఎం అని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి వెళ్తే లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ రాదా అని ప్రశ్నించారు. సీఎం అన్నను పంపినప్పుడు ఎంపీని తనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తనను పోలీస్‌ స్టేషన్‌ కు ఎందుకు తీసుకెళ్తున్నారని, తాను ఏం తప్పు చేశానో చెప్పాలని ప్రశ్నించారు.

First Published:  13 Nov 2024 2:13 PM IST
Next Story