ప్రజావాణి నిలిపివేత.. ఎందుకంటే..?
డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రగతిభవన్ ముందు ఉన్న కంచెను తొలగించి దాని పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది రేవంత్ సర్కార్. ఎన్నికల కోడ్ కారణంగా మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు స్టేట్ నోడల్ ఆఫీసర్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక జూన్ 7 నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రగతిభవన్ ముందు ఉన్న కంచెను తొలగించి దాని పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా IAS అధికారి దివ్యను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. వారానికి రెండు రోజుల చొప్పున ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజాభవన్‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేషన్‌కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు, ధరణి సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవచ్చు.