3 నెలలు, 13 వేల కోట్ల అప్పు.. రేవంత్ సర్కార్ ప్లాన్
జనవరిలో రూ.4 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ.3 వేల కోట్లు, మార్చిలో రూ.6 వేల కోట్లు అప్పుగా తీసుకురానుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రేవంత్ సర్కార్ అప్పులు రూ.14,400 కోట్లకు చేరనున్నాయి.
రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ చేసిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు రెడీ అయింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 1400 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చిన రేవంత్ సర్కార్.. రాబోయే మూడు నెలల్లో మరో రూ13 వేల కోట్ల రుణం తీసుకునేందుకు సిద్ధమైంది.
జనవరిలో రూ.4 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ.3 వేల కోట్లు, మార్చిలో రూ.6 వేల కోట్లు అప్పుగా తీసుకురానుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రేవంత్ సర్కార్ అప్పులు రూ.14,400 కోట్లకు చేరనున్నాయి.
వచ్చే 3 నెలల్లో ఆర్బీఐ నుండి రూ.13,000 కోట్ల అప్పు తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం.
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2023
జనవరి - రూ.4,000 కోట్లు
ఫిబ్రవరి - రూ.3,000 కోట్లు
మార్చ్ - రూ.6,000 కోట్లు pic.twitter.com/qCv4szJ37a
అప్పులపై మొన్నటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని అసెంబ్లీలో కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించామంటూ స్వేదపత్రం విడుదల చేసింది.