Telugu Global
Telangana

నెలాఖరులో మరో గ్యారంటీ! - ప్రజాపాలనపై రేవంత్ కీలక సమీక్ష

అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచారు. ఈ హామీ వల్ల ప్రభుత్వంపై ఇప్పటికప్పుడు పడే ఆర్థికభారం పెద్దగా ఉండదు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇంచుమించు ఇలాంటిదే.

నెలాఖరులో మరో గ్యారంటీ! - ప్రజాపాలనపై రేవంత్ కీలక సమీక్ష
X

ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) సెక్రటేరియట్‌లో కీలక సమీక్ష చేయబోతున్నారు. మంత్రులతో పాటు అన్నిశాఖల ఉన్నతాధికారులు మీటింగ్‌కు హాజరవుతారు. ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ prajapalana.telangaana.gov.inను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు. కాంగ్రెస్‌ నెల రోజులు పాలన, అమలు చేయాల్సిన మిగతా గ్యారంటీలు, ఆర్థిక వనరులపై సమావేశంలో చర్చిస్తారు.

ఐదు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ సర్కారు ఈ నెలాఖరు నాటికి మరో గ్యారంటీని పట్టాలెక్కించాలని చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే ఓ పథకాన్ని ఎంపిక చేయబోతున్నారు. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచారు. ఈ హామీ వల్ల ప్రభుత్వంపై ఇప్పటికప్పుడు పడే ఆర్థికభారం పెద్దగా ఉండదు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇంచుమించు ఇలాంటిదే.

ఈ నేపథ్యంలో ఆర్థికభారం తక్కువ ఉండేలా రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.350 కోట్ల భారం మాత్రమే పడుతుంది. అయితే గ్యాస్ సిలిండర్‌పై రాయితీని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేయాలా..? లేదా కంపెనీకి చెల్లించాలా..? అన్న విషయమై మంత్రుల బృందం ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2022-23లో తెలంగాణలో 6.67 కోట్ల గృహ వినియోగ సిలిండర్లు బుక్‌ అయ్యాయి. ఈ లెక్కన ఒక్కో కుటుంబం ఏడాదికి 6 సిలిండర్లు వాడుతోంది. ఈ నేపథ్యంలో రాయితీని 6 సిలిండర్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

First Published:  8 Jan 2024 3:48 AM GMT
Next Story