Telugu Global
Telangana

ఇంటింటికి సమ్మక్క-సారలమ్మ బంగారం.. రేవంత్‌ సర్కార్‌ ప్లాన్‌

శ్రీధర్‌బాబు సూచనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రతిపాదనను అమల్లోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇంటింటికి సమ్మక్క-సారలమ్మ బంగారం.. రేవంత్‌ సర్కార్‌ ప్లాన్‌
X

అయోధ్యలో బాలక్‌ రామ్‌ ప్రతిష్ఠాపనకు ముందు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అక్షింతలు పంచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఓ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మేడారంలో సమ్మక్క - సారలమ్మల జాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ జాతరలో బెల్లంను బంగారంగా పిలుస్తుంటారు. ఈ బంగారంతో పాటు పసుపు, కుంకుమను ఇంటింటికి పంపే అంశాన్ని రేవంత్ సర్కార్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం రేవంత్ నేతృత్వంలో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇంటింటికి సమ్మక్క-సారలమ్మ బంగారం పంచాలని ప్రతిపాదన చేయగా.. పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక కేడర్ నేతృత్వంలో పంచాలని సభ్యుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది.

శ్రీధర్‌బాబు సూచనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రతిపాదనను అమల్లోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను మంత్రులు కొండా సురేఖ, సీతక్కలకు అప్పజెప్పినట్లు సమాచారం. అక్షింతల పంపిణీ వెనుక రాజకీయం ఉందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అక్షింతల పంపిణీతో బీజేపీ ఇంటింటికి చేరువయ్యే ప్రయత్నం చేసిందని.. దానికి కౌంటర్‌గా రేవంత్ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  31 Jan 2024 5:27 PM IST
Next Story