Telugu Global
Telangana

రైతుబంధు ఆలస్యం.. కారణం చెప్పిన రేవంత్

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇస్తే వాళ్ల సిబిల్ స్కోరు పడిపోయే ప్రమాదం ఉంటుందని.. లోన్లు, EMI అవసరాలు ఉంటాయన్నారు. జీతాలు ముందుగా ఇవ్వడం వల్లే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి రెండు, మూడు రోజుల ఆలస్యమైందన్నారు.

రైతుబంధు ఆలస్యం.. కారణం చెప్పిన రేవంత్
X

రైతుబంధు పంపిణీ ఆలస్యంపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతుబంధు పంపిణీ ఆలస్యం కావడానికి కారణాలను వివరించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం మళ్లించామని చెప్పారు. అందుకోసమే రైతుబంధు నిధుల పంపిణీ రెండు, మూడు రోజులు ఆలస్యమైందన్నారు.

గత ప్రభుత్వంలో ఏనాడూ 5వ‌ తారీఖు లోపు జీతాలు పడలేదని, కానీ తాను సీఎం అయిన వెంటనే చేసి చూపించానన్నారు రేవంత్ రెడ్డి. నాలుగో తారీఖున జీతాలు ఇచ్చానన్నారు. జీతాలు త్వరగా ఇవ్వాలని తనను ఏ ఉద్యోగి అడగకున్నా.. బాధ్యత తీసుకుని జీతాలు ముందుగా వేశామన్నారు రేవంత్ రెడ్డి.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇస్తే వాళ్ల సిబిల్ స్కోరు పడిపోయే ప్రమాదం ఉంటుందని.. లోన్లు, EMI అవసరాలు ఉంటాయన్నారు. జీతాలు ముందుగా ఇవ్వడం వల్లే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి రెండు, మూడు రోజుల ఆలస్యమైందన్నారు. ఇక రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని గత నెల 12న ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. దాదాపు 20 రోజులు పూర్తయినంది. ఇప్పటివరకూ 40 శాతం మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశామని ప్రభుత్వం చెప్పింది. సోమవారం నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని స్పష్టం చేసింది.

First Published:  7 Jan 2024 1:16 PM IST
Next Story