Telugu Global
Telangana

టపాసులు కాల్చడంపై హైదరాబాద్‌లో ఆంక్షలు

సైబరాబాద్ పరిధిలో బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించారు

టపాసులు కాల్చడంపై హైదరాబాద్‌లో ఆంక్షలు
X

దీపావళి పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.హైదరాబాద్ నగరంలో టపాసులు కాల్చుకోవడంపై ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రకటన విడుదల చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు.

ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ దీపావళి సందర్భంగా ఈ నిబంధనలు ఉంటాయని, ప్రజలు గ్రహించి తమకు సహకరించాలని కోరారు. రాత్రి 8 గంటలకు ముందు గానీ.. 10 గంటల తర్వాత గానీ.. పబ్లిక్ ప్లేసుల్లో, పోలీస్ స్టేషన్ల పరిధిల్లో క్రాకర్స్ పేల్చితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి.. దీపావళిని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

First Published:  31 Oct 2024 10:47 AM GMT
Next Story