Telugu Global
Telangana

మహిళలను గౌరవించాలే.. సోషల్‌ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలే

మంత్రి కొండా సురేఖ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్న : మాజీ మంత్రి హరీశ్‌ రావు

మహిళలను గౌరవించాలే.. సోషల్‌ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలే
X

మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని మాజీ మంత్రి హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు. మహిళలపై అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించబోరని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తాను ఇలాంటి చర్యలను ఉపేక్షించబోనని తెలిపారు. మంత్రి కొండా సురేఖకు సోషల్‌ మీడియాలో కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నానని, సోషల్‌ మీడియాలో అందరూ బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. ఇటీవల మెదక్‌ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కు ఎంపీ రఘునందన్‌ రావు చేనేత దండ వేసి సత్కరించారు. ఈ ఫొటోను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాకు చెందిన వాళ్లు ట్రోలింగ్‌ చేస్తూ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని కొండా సురేఖ ప్రెస్‌ మీట్‌ పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. కొండా సురేఖ ప్రెస్‌ మీట్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమెపై జరిగిన ప్రచారానికి హరీశ్‌ రావు విచారం వ్యక్తం చేశారు.

First Published:  30 Sept 2024 10:26 PM IST
Next Story