ఒక్కరు తప్ప అంతా సిట్టింగులే.. బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాలు గెలవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగా గెలుపుగుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మళ్లీ అవకాశం దొరికింది. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరును బీజేపీ అధిష్టానం ఫస్ట్ లిస్టులో ప్రకటించలేదు. 17 లోక్‌సభ స్థానాలకుగాను 6 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీజేపీ మరో 11 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
ప్రస్తుతం ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల్లో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ముగ్గురికి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాలనే బీజేపీ హైకమాండ్ కేటాయించింది. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగబోతున్నారు. వీరితోపాటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాలు గెలవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగా గెలుపుగుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరుగురు అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. వీరితోపాటు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, రఘునందనరావుకు మెదక్ ఎంపీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.