తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల.. అందెశ్రీ భావోద్వేగం
ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ రాసిన ఈ పాటకు.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందెశ్రీ మార్పులు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందె శ్రీ రచించి.. కీరవాణి స్వరకల్పన చేసిన జయజయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మొత్తం 2 నిమిషాల 32 సెకన్ల నిడివితో ఈ పాటను రిలీజ్ చేశారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందె శ్రీ భావోద్వేగానికి గురయ్యారు. జై తెలంగాణ అంటూ నినదించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ రాసిన ఈ పాటకు.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందెశ్రీ మార్పులు చేశారు. ఇక ఈ పాటకు కీరవాణి సంగీతం అందించడం కొంత వివాదం కూడా నడిచింది.
Here is Jaya Jayahe Telangana - song official rendition released by CM Revanth Reddy at decennial celebrations of Telangana formation Day
— Naveena (@TheNaveena) June 2, 2024
Poet Ande Sri was emotional as the song was played. It is composed by MM Keeravani pic.twitter.com/GhE8q5FOQk
మొత్తంగా జయజయహే తెలంగాణ అంటూ ప్రారంభమయ్యే ఈ గీతం.. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి.. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలే.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ ముగుస్తుంది.