Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు

ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
X

ఏపీలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. భుమి క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్లు కోసం బారులుదీరారు. దీంతో గుంటూరు, విజయవాడ సహా పలు చోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మార్కెట్‌ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు చేసే అవకాశం ఉంది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు, స్ట్రక్చర్ విలువలను సవరించాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వం విలువలను భారీగా పెంచిందని భావించిన ఏపీ ప్రభుత్వం, వీటిని సవరించాలని నిర్ణయించింది.

First Published:  30 Jan 2025 8:39 PM IST
Next Story