అజ్ఞాతం వీడిన కేసీఆర్.. ఫొటో చూశారా!
వైరల్ ఫీవర్ కారణంగా దాదాపు నాలుగు వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. దాంతో ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇటీవల కేటీఆర్ చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. అనారోగ్యం కారణంగా నాలుగు వారాలుగా ప్రగతిభవన్‌కే పరిమితమైన కేసీఆర్.. ఫస్ట్ టైం కెమెరాకు కనిపించారు. ప్రగతిభవన్‌లో గురువారం సీఎం కేసీఆర్‌తో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు అందించారు శ్రీనివాస్ గౌడ్. భవిష్యత్తులో మహబూబ్‌నగర్ మరింత అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారని చెప్పారు శ్రీనివాస్ గౌడ్.
వైరల్ ఫీవర్ కారణంగా దాదాపు నాలుగు వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. దాంతో ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇటీవల కేటీఆర్ చెప్పారు. వ్యక్తిగత డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారని వివరించారు. దీంతో కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ అభిమానులు, నేతలు ఆందోళనకు గురయ్యారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్‌తో ఉన్న ఫొటోను పంచుకోవడంతో బీఆర్ఎస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 15న అభ్యర్థులకు బీఫామ్‌లు అందించనున్నారు. అదే రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ 9 వరకు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మొత్తంగా కేసీఆర్ 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొంటారు.