Telugu Global
Telangana

రైట్‌..రైట్‌.. లాభాల బాటలో టీఎస్‌ఆర్టీసీ..!

రాష్ట్రంలోని 96 డిపోలకు గానూ 90 డిపోలు లాభాన్ని ఆర్జించాయి. సాధారణంగా సోమవారాల్లో ఆర్టీసీకి రూ.16 కోట్ల నుంచి 17 కోట్ల ఆదాయం వస్తుండగా..ఈ నెల 11న ఏకంగా రూ.20 కోట్ల 22 లక్షల ఆదాయం వచ్చింది.

రైట్‌..రైట్‌.. లాభాల బాటలో టీఎస్‌ఆర్టీసీ..!
X

ఆర్టీసీ అంటేనే నష్టాలు, అప్పులు అనే మాట గతంలో వినిపించేది. అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం నష్టాలు, అప్పుల సుడిగుండం నుంచి క్రమంగా బయటపడుతోంది. ఈ నెల 11న తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ఆర్టీసీకి లాభాలు వచ్చాయి అనే మాట కేవలం దసరా, సంక్రాంతి సీజన్‌లోనే వింటుంటాం. కానీ ఈ నెల 11న తెలంగాణ ఆర్టీసీ పంట పండింది. ఏకంగా రాష్ట్రంలోని 96 డిపోలకు గానూ 90 డిపోలు లాభాన్ని ఆర్జించాయి. సాధారణంగా సోమవారాల్లో రూ.16 కోట్ల నుంచి 17 కోట్ల ఆదాయం వస్తుండగా..ఈ నెల 11న ఏకంగా రూ.20 కోట్ల 22 లక్షల ఆదాయం వచ్చింది. కేవలం ముషీరాబాద్‌-2, ఉట్నూరు, కోస్గి, నారాయణ ఖేడ్‌ డిపోల్లో మాత్రమే నష్టాలు వచ్చాయి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. రెండు, మూడు రోజుల్లో బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

First Published:  13 Sept 2023 11:21 AM IST
Next Story