Telugu Global
Telangana

దసరాకు ముందే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నెలకొన్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పాలింది.

దసరాకు ముందే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
X

తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నెలకొన్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పాలింది. తెలంగాణలో దసరా పండుగ అంటే కంపల్సరీగా సుక్క ముక్క లేనిదే పండగకు కిక్కు ఉండదు. సాంప్రదాయం ప్రకారం దసరా రోజు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా మందు, మాసం ఉండాల్సిందే. పండుగకు ముందు వరుసగా సెలవులు రావడం వీకెండ్ కావడంతో మద్యం అమ్మకాలు ఫుల్‌గా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు స్పష్టంచేశారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

దసరా సందర్భంగా మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని లిక్కర్ గౌడన్ల నుంచి ముందుగానే మద్యం నిల్వలను దుకాణాలకు, బార్, రెస్టారెంట్లకు తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. భారీగా స్టాక్ పెట్టుకున్నారు. మద్యం ప్రియులు మూడునాలుగైదు రోజుల నుంచే మద్యం కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,260మద్యం దుకాణాలు, 1,171బార్, రెస్టారెంట్లు ఉన్నాయి. గత సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2,826కోట్ల లిక్కర్ అమ్మకాలు సాగాయి. 2024సెప్టెంబర్ 30వరకు 2,838.92కోట్ల అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

First Published:  11 Oct 2024 4:41 PM IST
Next Story