రికార్డు బద్దలు కొట్టిన కేసీఆర్ ఇంటర్వ్యూ.. కేటీఆర్ ఏమన్నారంటే..
కేసీఆర్ ఇంటర్వ్యూ అనగానే గ్రామాలు మొదలు, పట్టణాలు, మెట్రో సిటీల వరకూ లక్షలాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు. ఐపీఎల్ మ్యాచ్‌ను బంద్ పెట్టి మరీ కేసీఆర్ డిబేట్‌నే ఆసక్తిగా చూశారు.
కేసీఆర్‌కు ఉండే క్రేజే వేరు. బహిరంగ సభల్లో స్పీచులు, ప్రెస్‌మీట్లు, టీవీ డిబేట్లు.. ప్రోగ్రాం ఏదైనా కేసీఆర్ పంచులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మంగళవారం టీవీ-9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2012లో టీవీ-9 రజనీకాంత్‌కు నాన్‌స్టాప్‌గా 3.30 గంటలపాటు ఇంటర్వ్యూ ఇచ్చారు కేసీఆర్. పుష్కరకాలం తర్వాత అదే టీవీ-9 రజనీకాంత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 4 గంటలపాటు సాగిన ఈ ఇంటర్వ్యూకు సుమారు 95 వేలకు పైగా నాన్‌స్టాప్ లైవ్ వ్యూస్ వచ్చాయి. ఈవెంట్స్ మినహా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఈ స్థాయిలో భారీ లైవ్ వ్యూస్ రావడం తెలుగు మీడియాలోనే రికార్డుగా చెబుతున్నారు.
క్రేజ్ కా బాప్ కేసీఆర్..
కేసీఆర్ ఇంటర్వ్యూ అనగానే గ్రామాలు మొదలు, పట్టణాలు, మెట్రో సిటీల వరకూ లక్షలాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు. ఐపీఎల్ మ్యాచ్‌ను బంద్ పెట్టి మరీ కేసీఆర్ డిబేట్‌నే ఆసక్తిగా చూశారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలు తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన భారీ LED స్క్రీన్లపై వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు డిబేట్‌ను చూశారు. ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్తున్న ఒక్కొక్క డైలాగ్‌కు చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
Now that’s called a Master’s Class
— KTR (@KTRBRS) April 23, 2024
As they say, Form is temporary but Class is permanent #KCRonTV9
కేసీఆర్.. మాస్టర్ క్లాస్..
కేసీఆర్ మారథాన్ ఇంటర్వ్యూను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మాస్టర్ క్లాస్’గా అభివర్ణించారు. ‘ఇది కేసీఆర్ మాస్టర్ క్లాస్. ఫాం తాత్కాలికం క్లాస్ శాశ్వతం అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేసీఆర్ క్రేజ్!
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2024
సిరిసిల్ల జిల్లా గంభిరావు పేట్ మండలం
గజసింగవరం గ్రామంలో స్క్రీన్ ఏర్పాటు చేసుకొని కేసీఆర్ లైవ్ చూస్తున్న ప్రజలు.#KCRonTV9 pic.twitter.com/RJyawwPLxn
పాత కేసీఆర్ వచ్చేశారు..
కొద్దిరోజుల కిందటే బీఆర్‌ఎస్ నేతలతో జరిగిన మీటింగ్‌లో త్వరలోనే మీరు పాత కేసీఆర్‌ను చూడబోతున్నారంటూ చెప్పారు కేసీఆర్. అన్నట్లుగానే నిన్నటి ఇంటర్వ్యూలో వింటేజ్ కేసీఆర్ కనిపించారు. ఆ వాగ్దాటి, పంచులు, ప్రాసలు, విషయ పరిజ్ఞానం, హుందాతనం కలగలిసి బీఆర్‌ఎస్ శ్రేణులకు ఫుల్ మీల్స్ పెట్టారు. తెలంగాణతో పాటు నేషనల్ మీడియాలోనూ కేసీఆరే హాట్ టాపిక్. ఏ పత్రిక చూసినా కేసీఆరే బ్యానర్, ఏ టీవీ చూసినా కేసీఆరే బ్రేకింగ్. మనదేశంలో మరే నాయకుడికి లేనంత క్రేజ్‌ను ఈ విధంగా కేసీఆర్ సొంతం చేసుకున్నారు.