'మూసీ' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
BY Naveen Kamera16 Nov 2024 9:01 PM IST

X
Naveen Kamera Updated On: 16 Nov 2024 9:01 PM IST
మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మూసీ పరివాహక ప్రాంతం అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసీనగర్ లో ఆయన మూసీ బాధిత కుటుంబాలతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూసీ బాధితుల తరపున పోరాడే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. అందుకోసమే మూసీ బాధితులతో కలిసి ఈరోజు నిద్ర చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మూసీ బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎప్పుడు వచ్చి బుల్డోజర్లతో తమ ఇండ్లు కూల్చేస్తారేమోనని భయం భయంగా బతుకు వెళ్లదీస్తున్నామని తెలిపారు. మూసీ బాధితులకు తాము అండగా ఉంటామని అన్ని బస్తీల్లోనూ రాత్రి బస చేసి వారికి భరోసా కల్పిస్తామని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలన్నారు.
Next Story