Telugu Global
Telangana

మూసీపై సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్దం : కిషన్‌రెడ్డి

మూసీ నిర్వాసితులకు భరోసా నిచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు తాను సిద్దమని ఆయన తెలిపారు

మూసీపై సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్దం :  కిషన్‌రెడ్డి
X

మూసీ సుందరీకరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు తాను సిద్దమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మూడు నెలలపాటు తాను మూసీ నది పక్కన నివాసం ఉంటానని, మరి ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధమేనా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇండ్లకు మార్కింగ్ చేస్తూ ఇండ్లు కూల్చివేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇవాళ లంగర్ హౌస్ డివిజన్‌లోని రాందేవ్ గూడ, బాపూనగర్ ప్రాంతాలను సందర్శించి అక్కడి స్థానికులతో కేంద్రమంత్రి మాట్లాడారు.

పేదవాడి ఇంటిని కూల్చివేసి.. ఆ స్థలంలో సుందరీకరణ చేస్తామనుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. బాధిత ప్రజల పక్షాన మేం నిలబడతామనొ. అనాలోచిత నిర్ణయాలు కాదు.. ముందు రిటైనింగ్ వాల్ కట్టండని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు . ప్రాణాలకు తెగించైనా పేదల ఇండ్ల కూల్చివేతలను బీజేపీ అడ్డుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారి తరఫున పోరాడుతామని, అడ్డగోలుగా వచ్చి ఇళ్లపై పడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి చేతనైతే మూసీలో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

First Published:  19 Oct 2024 3:37 PM IST
Next Story