Telugu Global
Telangana

రేషన్‌ కార్డులు, జాబ్‌ క్యాలెండర్‌.. టీ.కేబినెట్ కీలక నిర్ణయాలు

రేషన్ కార్డుల జారీకి కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఈ సబ్‌ కమిటీ రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు రూపొందించింది.

రేషన్‌ కార్డులు, జాబ్‌ క్యాలెండర్‌.. టీ.కేబినెట్ కీలక నిర్ణయాలు
X

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో జాబ్‌ క్యాలెండర్, రేషన్ కార్డులతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డుల జారీకి కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఈ సబ్‌ కమిటీ రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు రూపొందించింది.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..

- జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం, రేపు అసెంబ్లీలో విడుదల చేయనున్న సీఎం రేవంత్

- జంట నగరాలకు గోదావరి జలాలు, మల్లన్న సాగర్ నుంచి శామీర్‌పేట చెరువుకు అక్కడి నుంచి ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌లకు తీసుకురావాలని నిర్ణయం.

- వయనాడ్ మృతులకు సంతాపం, బాధితులకు సహాయం అందించాలని నిర్ణయం

- రేషన్‌ కార్డులతో పాటు హెల్త్‌ కార్డుల జారీపైనా చర్చ. ఇందుకోసం సబ్‌కమిటీ ఏర్పాటు

- క్రికెటర్ సిరాజ్‌, అథ్లెట్లు ఈషా సింగ్, నిఖత్ జరీన్‌లకు ఇళ్ల స్థలాలతో పాటు నిఖత్ జరీన్, సిరాజ్‌లకు గ్రూప్‌ -1 ఉద్యోగం

- దివంగత ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్‌ కమిషనర్‌గా ఉద్యోగం

- దివంగత అడిషనల్ డీజీపీ మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం

- గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్స్ పూర్తి, మిగిలిన భూసేకరణ కోసం అంచనాలు తయారీకి ఆమోదం

- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ పేర్లను మరోసారి సిఫార్సు చేసిన కేబినెట్

- నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేబినెట్ నిర్ణయం.

- ధరణి పోర్టల్ పేరు భూమాత పోర్టల్‌గా మార్పు

- GHMCలో శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంపై కేబినెట్ సబ్‌ కమిటీ.. సబ్‌కమిటీలో శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్

First Published:  1 Aug 2024 8:10 PM IST
Next Story