Telugu Global
Telangana

బీఆర్ఎస్ విజయం ఖాయం చేసిన మరో సర్వే..

రాజ్ నీతి గ్రూప్ చేపట్టిన ఈ సర్వే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని తేల్చింది. బీఆర్ఎస్ 75 స్థానాల్లో విజయం సాధించి ధీమాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే సారాంశం.

బీఆర్ఎస్ విజయం ఖాయం చేసిన మరో సర్వే..
X

తెలంగాణ ఎన్నికలకు వారం రోజులే టైమ్ ఉన్న ఈ దశలో మరో సర్వే బీఆర్ఎస్ లో ఉత్సాహాన్ని నింపింది. రాజ్ నీతి గ్రూప్ చేపట్టిన ఈ సర్వే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని తేల్చింది. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటం అంతా గాలిబుడగేనని ఈ సర్వేతో స్పష్టమైంది. బీఆర్ఎస్ 75 స్థానాల్లో విజయం సాధించి ధీమాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజ్ నీతి గ్రూప్ సర్వే సారాంశం.


ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

బీఆర్ఎస్ - 75 ( 6 సీట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు )

కాంగ్రెస్ - 31 ( 4 సీట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు )

బీజేపీ - 5 ( 2 సీట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు )

ఎంఐఎం - 7

ఇతరులు - 1

ఓట్ల శాతం విషయానికొస్తే 42.43శాతం ఓట్లు బీఆర్ఎస్ కి వస్తాయని ఈ సర్వే చెబుతోంది. ఇందులో 3 శాతం పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు. కాంగ్రెస్ కి 32.62 శాతం ఓట్లు వస్తాయి. ఇందులో 3 శాతం వేరియేషన్ ఉండే అవకాశముంది. బీజేపీకి 16.71 శాతం ఓట్లు వస్తాయి. బీజేపీ ఓట్లలో 3శాతం మార్పు ఉండొచ్చు. ఎంఐఎం కి 3.08శాతం ఓట్లు వస్తాయి.

మొత్తం 119 నియోజకవర్గాల్లో 38,351మంది నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ సర్వే చేపట్టారు. రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్నతరహా పరిశ్రమల వారు, కార్మికులు, గృహిణిలు.. ఇలా అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలు సేకరించి సర్వే ఫలితాలు విడుదల చేశారు.

కాంగ్రెస్ పై నమ్మకం లేదు..

ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు ఉన్నట్టు పలు కథనాలు వస్తున్నాయి. అయితే ఇది కేవలం మీడియా వరకే పరిమితం అయిందని, ఓట్ల రూపంలో మారలేదని రాజ్ నీతి సర్వే చెబుతోంది. మీ నియోజకవర్గంలో గెలుపెవరిది అని అడిగితే చాలామంది కాంగ్రెస్ అంటున్నారట, మీ ఓటు ఎవరికి అంటే మాత్రం బీఆర్ఎస్ కేనని చెబుతున్నారట. ఇలాంటి చిత్రమైన పరిస్థితి గ్రామాల్లో ఉందని అంటున్నారు సర్వేసంస్థ నిర్వాహకులు. అంటే కాంగ్రెస్ వైపు మొగ్గు ఉందని అనేవారు కూడా బీఆర్ఎస్ కే ఓటు వేయాలనుకుంటున్నారు. నాయకత్వ లేమి, కాంగ్రెస్ పై ఉన్న అప నమ్మకం.. మెజార్టీ ప్రజలను బీఆర్ఎస్ వైపే ఉండేలా చేస్తోంది.

First Published:  23 Nov 2023 11:00 PM IST
Next Story