సెక్రటేరియట్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం.. కొత్త వివాదం.!
సెక్రటేరియట్ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల మార్పు వివాదం మరిచిపోకముందే.. మరో విగ్రహం విషయంలో రగడ మొదలైంది. సెక్రటేరియట్, అమరవీరుల స్తూపానికి మధ్య ఖాళీగా ఉన్న జాగాలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడం వివాదానికి దారి తీసింది.
సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి
— Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) February 14, 2024
ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం ?
అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి
రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించింది. pic.twitter.com/ZXgH5bXMhz
సెక్రటేరియట్ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అసలు తెలంగాణ సెక్రటేరియట్‌కు రాజీవ్‌గాంధీకి సంబంధమేంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆ స్థలంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.